ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు
సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

