వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో గురువారం జరగనుంది. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. ఈనెల 20 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశా ల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశా లపై ఈ సమావేశంలో
చర్చించి, ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

