భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తాడికొండ గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) పాల్గొన్నారు. మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
Published on:

