బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయి కృష్ణ పేరును వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధమ్మ, యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి ఈ ప్రకటన చేశారు. 2008, 2014లో కౌన్సిలర్గా, 2021లో వైస్ చైర్మన్గా పనిచేసిన ఆయన ప్రజాసేవా అనుభవాన్ని పార్టీ ప్రస్తావించింది. బద్వేల్లోని 40 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Rachapudi Venkata Sai Krishna Named YSRCP Candidate for Badvel Municipal Chairperson
The YSRCP has finalised the name of former municipal vice-chairperson Rachapudi Venkata Sai Krishna as its candidate for Badvel municipal chairperson. MLC D.C. Govinda Reddy, MLA Dr Dasari Sudhamma and youth leader Devasani Aditya Reddy made the announcement. The party highlighted his public service experience, noting that he served as a councillor in 2008 and 2014 and as vice-chairperson in 2021. The leaders called on party leaders and workers to work unitedly for the victory of YSRCP candidates in all 40 wards of Badvel.

