జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. పొదలకూరు చిట్టేపల్లి కాలనీలో పేదల స్థలాల హద్దురాళ్లు తొలగించి గ్రావెల్ తరలించారని తెలిపారు. జగన్ హయాంలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేసి, రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని, కూటమి ప్రభుత్వం పేదల ఇళ్లకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు హామీలకు భిన్నంగా
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.59 లక్షలకే పరిమితం చేశారని విమర్శించారు.

