దాచేపల్లి పట్టణంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరికి నిరసనగా అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా దాచేపల్లిలో పోలీసులు హద్దులు దాటి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Police stop YSRCP candidates in Dachepalli
Tension prevailed in Dachepalli town after police stopped YSRCP candidates who were on their way to file nominations. The candidates staged a sit-in on the road in protest against the police action, leading to an argument. The YSRCP candidates expressed anger, alleging that police had been exceeding their limits and acting arbitrarily in Dachepalli for the past two days.

