పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినపత్రం అందించిన వైసీపీ నాయకులు మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా చేసిందని నిరుద్యోగులకు అండగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు విద్యార్థులు, నిరుద్యోగులతో కలసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినత
పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ వెన్నుపోటు అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారని ఎన్నికల ముందు ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచారని, వాలంటరీలకు జగన్మోహన్ రెడ్డి 5000 రూపాయలు ఇస్తున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచారని, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగం వచ్చేంతవరకు ప్రతినెల 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని, డీఎస్సీలో ఉద్యోగాలను అమ్ముకొని స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు వెన్నుపోటు పొడిచారని భావితరాలను కాపాడుకోవాలని, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితోనో సిబిఐతోనో ఎంక్వయిరీ చేయించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని లేని పక్షంలో నిరుద్యోగుల తరుపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాలనాయకులు పాల్గొన్నారు..

