తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ కలిశారు. తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని జగన్కు బహుకరించారు. జగన్ రాజకీయ జీవనయానం, వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ రాధ, ఎంవీఎస్ నాగిరెడ్డి, రమేష్, కొవ్వూరి త్రినాథరెడ్డి, సుబ్బారావు తదితరులు ఉన్నారు.
Author presents ‘Sthitaprajna’ book to Jagan
Senior journalist and technocrat Dr Kothapalli Srinivasa Varma met former Chief Minister and YSRCP president YS Jagan Mohan Reddy at the YSRCP central office in Tadepalli. He presented Jagan with his book, ‘Sthitaprajna’. He said the book comprehensively chronicles Jagan’s political journey, various phases and leadership qualities. Lakshmi Radha, MVS Nagireddy, Ramesh, Kovvuri Trinadha Reddy, Subbarao and others were present at the event.

