అంబేద్కర్ జయంతి: పార్టీకి అతీతంగా నేతల ఐక్యతా నివాళులు

Published on:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ఐక్యత దర్శనమిచ్చింది. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

Geddam Prathap