స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను గవర్నర్కు వివరించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు, రేపు గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తిపై దాడి ఘటనతో పాటు రాయచోటిలో వైఎస్సార్సీపీ కార్యాలయం దగ్ధం, పులివెందులలో కాల్పుల ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
YS Jagan seeks Governor’s appointment tomorrow
YSRCP chief YS Jagan is preparing to apprise the Governor of the developments that took place in the state during the filing of nominations for the local body elections. YSRCP leaders, who have already lodged several complaints with the State Election Commission on the issue, have sought an appointment to meet the Governor tomorrow. They are expected to bring to the Governor’s attention the attack on MPs Mithun Reddy and Gurumoorthy, the burning of the YSRCP office in Rayachoti and the firing incident in Pulivendula.

