విజయసాయినే వైఎస్ జగన్ ఎక్కువగా అభిమానించారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సొంతంగా రాజకీయాలు చేసుకోవచ్చని, తమను టార్గెట్ చేస్తే రియాక్షన్ గట్టిగా ఉంటుందని హెచ్చరించారు. 2024 తర్వాత తప్పుడు కేసుల్లో పలువురు అరెస్టయ్యారని, విజయసాయి మాత్రం ఎలా తప్పించుకోగలిగారని ప్రశ్నించారు. విజయసాయి ఆరోపణలను ఇకపై పట్టించుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు.
విజయసాయి ఆరోపణలు ఇక పట్టించుకోం: సజ్జల
Published on:

