ఏ వ్యవస్థలో అయినా సమర్థులైన వ్యక్తుల్ని టీమ్‌గా పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తుంటాయి. రాజకీయ పార్టీలో కూడా టీమ్ ప్రధానం. వైసీపీ, వైఎస్ జగన్ దురదృష్టంకొద్ది టీమ్ ప్రధాన లోపంగా కనిపిస్తోంది. వైసీపీకి సానుకూల ఫలితాలు వచ్చి, అధికారాన్ని దక్కించుకుంటే, అనుభవించడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. అదే కష్టమొస్తే, జగన్ మాత్రమే మూల్యం చెల్లించుకోవాల్సి
వస్తోంది. దీనంతటికీ ప్రధాన కారణం, ట్రబుల్ షూటర్స్‌ను పెట్టుకోకపోవడమే. జగన్ చుట్టూ ట్రబుల్ క్రియేటర్స్ మాత్రమే వున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్‌ను, ఆయన పార్టీని బలిపెట్టడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

