Nagarjuna Yadav: If you can’t convince them, confuse them… అవతల మనుషుల్ని ఒప్పించడం కుదరనప్పుడు గందరగోళం చేయండి.. ఇది అన్నది 1946-53 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న హ్యారీ ఎస్. ట్రూమన్ చెప్పిన మాట.. ఇప్పుడు ఆ సూత్రాన్ని అక్షరాలా విజయసాయి రెడ్డి అమలు చేస్తున్నట్టుంది! వైఎస్ జగన్ గారి దగ్గర మీరు నమ్మకం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? 4 ఏళ్ల
రాజ్యసభ సీటును వైరి పక్షానికి అప్పనంగా ఎందుకు అప్పజెప్పాల్సి వచ్చింది? సాధారణ సీఏగా ప్రాక్టీస్ చేసే మీరు, టీటీడీ బోర్డు మెంబర్గా, ప్రఖ్యాత Oriental Bank of Commerce (OBC) బ్యాంకు డైరెక్టర్గా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా, దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, ఒకానొక సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా కూడా అయ్యే అవకాశం దక్కేలా మీకు గౌరవ మర్యాదలు తెచ్చిన వైఎస్ జగన్ గారి కుటుంబాన్ని వదిలేసి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ మౌలికమైన ప్రశ్నలపై ప్రజలకు నిజాలు చెప్పలేక, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక, వాస్తవాలను ఒప్పుకోలేక… రెండేళ్ల నుండి మీరు చేస్తున్న సాముగారడీలు దేని కోసం సాయి రెడ్డి గారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కార్యకర్తల దగ్గరకు వెళ్లి, వారిని కింకర్తవ్యం బోధించి, కార్యోన్ముఖులను గావించి, నాయకుడిగా, ధీరుడిగా, ఆజానుబాహుడిగా, సగర్వంగా వైఎస్ జగన్ పక్కన నిటారుగా నిలబడే అవకాశాన్ని నువ్వెందుకు వదులుకున్నావ్?

