ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు కానీ, సాయం కానీ వద్దని మా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మేము ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. జగన్ ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి, ముద్రగడ మీదున్న అపార గౌరవాన్ని చాటారు. అంతిమ సంస్కారాలు ఏవిధంగా జరగాలో ఆయనే మాకు నిర్దేశించారు. ఆయన మాకు చెప్పిన మాటలు శిరోధార్యం, ఆ ప్రకారమే మేము చేసాము. క్రాంతి గారి కుటుంబానికి మాకు మధ్య గత
కొన్నేళ్లుగా రాకపోకలు లేవు. ఎలాంటి సంబంధాలు లేవు ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందో ముద్రగడ స్పష్టంగా చెప్పారు. ఆమె రాకూడదన్న నిర్ణయం మొదలుకొని ఇంటి ఆవరణంలో ఖననం చేయాలన్న నిర్ణయం వరకు మేము తీసుకున్న ప్రతి నిర్ణయము ముద్రగడ అంతిమ నిర్ణయమే.

