అర్హులకు టోకరా అనార్హుల చేతిలో విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టిన కూటమి జిల్లాకేంద్రమైన నరసరావుపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దగ డిఎస్సిని నిర్వహించి అనార్హులకు ఉద్యోగాలను దొడ్డి దారిలో
కట్టబెట్టి విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టారని నాడు జగనన్న ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే 1,50,000 కు పైగా పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశారని నేడు కూటమి ప్రభుత్వం 16,000 పోస్టుల డీఎస్సీని దగా చేసి అర్హులకు అన్యాయం చేశారని అలాగే రేపటి పౌరుల జీవితాలతో ఆటలాడుతున్నారని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని నేటి బాలలే రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని అలాంటి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఇప్పటికైనా చర్యలు తీసుకొని అర్హులైన వారికి అవకాశం కల్పించాలని రేపటి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు విద్యార్థి విభాగం పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు.

