తాడేపల్లి లోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్
ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ అమ్మాజీ, పబ్లిసిటి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను రాజశేఖర్, వంగవీటి నరేంద్ర, వేల్పుల రవికుమార్, రవిచంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

