భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల భారత రాజ్యాంగ నిర్మాత సంఘసంస్కర్త విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి పూలమాలవేసి నివాళులర్పించిన సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల
సుధీర్ భార్గవ రెడ్డి గారు అనంతరం 8వ వార్డులోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 8వ వార్డ్ వైయస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో సాధన వృద్ధుల అనాధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సత్తెనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు సంఘసంస్కర్తగా విద్యావేత్తగా న్యాయ శాస్త్రవేత్తగా ఆర్థిక వేత్తగా ప్రసిద్ధి చెందారని ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయనను బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారని అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు.

